: అందరినీ ఆకట్టుకుంటున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫొటో!


నటి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యను హగ్ చేసుకోగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  ఈ ఫొటోను అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇటీవ‌ల‌ ఆస్ట్రేలియాలో జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఎం (ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌) కు ఐశ్వ‌ర్య‌రాయ్‌ ముఖ్య అతిథిగా వెళ్లింది. త‌న కూతురిని కూడా త‌న వెంట తీసుకెళ్లింది. తల్లీకూతుళ్లిద్ద‌రూ తెల్ల రంగు దుస్తులు ధ‌రించి అంద‌రినీ ఆకర్షించారు. ఈ సంద‌ర్భంగానే ఈ ఫొటో తీశారు. ఈ ఫొటోకి ఏకంగా ల‌క్ష‌కు పైగా లైకులు వ‌చ్చాయి. ఐశ్వ‌ర్య రాయ్ ఎక్క‌డ‌కు వెళ్లినా త‌న వెంట త‌న కూతురిని తీసుకుని వెళుతోంది.

  • Loading...

More Telugu News