: రైల్వే బోర్డు చైర్మన్‌గా అశ్వని లోహాని నియామకం
నాలుగు రోజుల్లో రెండు రైలు ప్రమాదాలు జరిగిన కారణంగా రాజీనామా చేసిన రైల్వే బోర్డు మాజీ చైర్మన్ అశోక్ మిట్టల్ స్థానంలో అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అశ్వని ప్రస్తుతం ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రైలు ప్రమాదాల కారణంగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా తన రాజీనామా సమర్పించే యోచనలో ఉండగా, ప్రధాని మోదీ నిరీక్షించాలని ఆదేశించినట్లు సమాచారం.