: టీడీపీకి ప్లస్ పాయింట్ అదే: భూమా అఖిలప్రియ
నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పోలింగ్ శాతం భారీగా ఉందని... 90 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యం లేదని తెలిపారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని... ఇది టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగినప్పటికీ... చివరి క్షణాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.