: హైదరాబాద్‌లోని కాచిగూడ బిగ్ బజార్‌లో ఎస్కలేటర్‌పై నుంచి పడిపోయిన చిన్నారి.. తీవ్రగాయాలు
హైదరాబాద్‌లోని కాచిగూడ బిగ్ బజార్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. తమ మూడేళ్ల చిన్నారి అభిరామ్ తో బిగ్ బజార్‌లోకి వచ్చిన తల్లిదండ్రులు ఆ మాల్‌లో షాపింగ్ చేయడంలో బిజీ అయిపోయారు. బిగ్ బజార్‌లో ఉన్న ఓ బొమ్మ కారుపై కూర్చుని ఆ చిన్నారి ఆడుకుంటున్నాడు. మాల్‌లో ఆ టాయ్ కారును నడిపించిన అభిరామ్ ఒక్కసారిగా ఆ కారుతో పాటు ఎస్కలేటర్‌పై నుంచి కిందకు జారి పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.
ఆ ఎస్కలేటర్ దగ్గర సెక్యూరిటీ గార్డులు లేరు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులు దిల్ సుఖ్ నగర్ కు చెందిన సుధాకర్, సౌజన్య అని పోలీసులు చెప్పారు.