: కంపెనీ మీద కోపంతో తీసుకున్న అప్పును చిల్లర రూపంలో చెల్లించిన వ్యాపారి!
రష్యాకు చెందిన ఓ వ్యాపారి తనకు అప్పు ఇచ్చిన కంపెనీ మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి, తాను చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా చిల్లర రూపంలో చెల్లించాడు. అక్కడ ఉపయోగించే అతి చిన్న మారకం కోపెక్‌లు. సాధారణ మారకం రూబుల్. ఒక రూబుల్ 100 కోపెక్ నాణేలకు సమానం. వ్యాపారి అప్పు 46,700 రూబుల్స్. కాబట్టి అక్షరాల 4,670,000 కోపెక్ నాణేలను ఆరు పెద్ద సంచుల్లో తీసుకొచ్చి చెల్లించాడు.
ఫెడరల్ బైలీఫ్ సర్వీస్ కంపెనీ తనకు సరైన ఇన్సూరెన్స్ సేవలను అందించడం లేదని, అందుకే వాళ్లను ఇబ్బంది పెట్టడానికి, కావాలని తన అప్పు మొత్తాన్ని చిల్లర రూపంలోకి మార్చి చెల్లించినట్లు వ్యాపారి తెలిపాడు. ఇదిలా ఉండగా, కంపెనీ వ్యాపారి చెల్లించిన మొత్తాన్ని తీసుకుని, వాటి లెక్కింపు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని షరతు విధించడంతో వ్యాపారి తెల్లమొహం వేశాడు.