: నిన్ను చాలా మిస్సవుతున్నా నాన్నా!: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రియాంక చోప్రా తన తండ్రి అశోక్ చోప్రా జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేసింది. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా' అని తన ఇన్ స్ట్రాగ్రాం ఖాతాలో పేర్కొంది. తన తండ్రి తనకు ఎప్పటికీ హీరోనేనని తెలిపింది. ఆయనను తాను చాలా మిస్సవుతున్నానని పేర్కొంది. కేన్సర్ తో ఆరు సంవత్సరాలుగా బాధపడిన అశోక్ చోప్రా 2013లో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో తన తండ్రితో దిగిన పలు ఫొటోలను ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకుంది.