: ‘ట్రిపుల్ తలాక్ రద్దు’ తీర్పుపై సుదర్శన్ పట్నాయక్ రూపుదిద్దిన సైకత శిల్పాన్ని చూడండి!
సైకత శిల్పాల నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తాజాగా రద్దైన ట్రిపుల్ తలాక్ పై సైకత శిల్పాన్ని వేసి ఆకట్టుకున్నాడు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై పూరీ బీచ్‌లో తాను వేసిన సైకత శిల్పం అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అన్నాడు. ట్రిపుల్ తలాక్ పై చారిత్రాత్మక తీర్పు అని రాసి ఉన్న ఈ సైకత శిల్పంలో ముగ్గురు ముస్లిం మహిళలు ఉన్నారు. పై వైపున భారత న్యాయవ్యవస్థ చిహ్నాలు, త్రివర్ణాలు ఉన్నాయి.