: పోలింగ్ బూత్ దగ్గర మౌనికారెడ్డి హల్ చల్!
నంద్యాలలోని పోలింగ్ బూత్ లలోకి నియమ నిబంధనలకు విరుద్ధంగా పార్టీల నేతలు వెళ్తున్నట్టు సమాచారం. సెయింట్ జోసెఫ్ హైస్కూల్ పోలింగ్ బూత్ లోకి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డి తమ అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో భూమా అనుచరులను పోలీసులు బయటకు పంపారు. దీంతో, పోలీసులతో మౌనికారెడ్డి, అనుచరులు వాగ్వాదానికి దిగారు. తమ నాయకులను బయటకు పంపుతారా? అంటూ పోలీసులపై మౌనికారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.