: మరాఠా వస్త్రధారణలో ముద్దులొలికిస్తున్న చిన్నారి సితార!
నిండా ఆరేళ్లు రాకముందే మహేశ్, నమ్రతల కూతురు సితార సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారుతోంది. తమకు సంబంధించి మహేశ్, నమ్రత షేర్ చేస్తున్న ఫొటోలకు కొన్ని నిమిషాల్లోనే విపరీతంగా లైకులు, రీట్వీట్‌లు వస్తున్నాయి. ఇటీవల నమ్రత ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పెట్టిన సితార ఫొటోకు కూడా అలాగే స్పందన వస్తోంది. ఈ ఫొటోలో మరాఠా చీరకట్టులో, ముక్కుపుడక, కొప్పు, గాజులతో ఉన్న చిన్నారి సితార నెటిజన్ల మనసు దోచేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నమ్రత, తన కూతురుని ఈ వేషధారణలో అలంకరించినట్లు తెలుస్తోంది. ఇదే ఫొటోలో బెంగాలీ వస్త్రధారణలో ఉన్న ఫొటోగ్రాఫర్ దియా భూపాల్ కూతురుని కూడా చూడొచ్చు.