: నంద్యాలలో వెల్లువెత్తిన ప్రజా చైతన్యం... 40 శాతం ఓటింగ్ పూర్తి!


నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుంచే అన్ని పోలింగ్ బూతుల వద్ద ప్రజా సందడి నెలకొనగా, ఓటు వేయాలన్న ప్రజా చైతన్యం రాజకీయ నాయకులనే విస్మయ పరుస్తోంది. ఓటింగ్ ప్రారంభమై నాలుగు గంటలు గడువగా, ఇప్పటికే చాలా చోట్ల 40 శాతం, కొన్ని చోట్ల 50 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. వెల్లువెత్తిన ఓటర్లను చూస్తుంటే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.

 ఇంత భారీ సంఖ్యలో ఓటర్లను చూస్తున్న ప్రధాన పార్టీల వారు.. ఎవరికి వారే తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు. నంద్యాల పట్టణంలోనే పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుండగా, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో ఓటింగ్ మధ్యాహ్నానికే పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు ఇంతవరకూ చోటు చేసుకోలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో భూమా బ్రహ్మానందరెడ్డి తనకు ఓట్లు వేయాలని ప్రచారం సాగిస్తున్నట్టు వైకాపా ఫిర్యాదు చేయగా, శిల్పా వర్గీయులు రిగ్గింగ్ కు యత్నిస్తున్నారని టీడీపీ ఆరోపించింది.

  • Loading...

More Telugu News