: ఎంతో ఎదురుచూసిన 'నోకియా 6' వచ్చేసింది... ధర రూ. 14,999 పైనా పలు డిస్కౌంట్లు!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'నోకియా 6' మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్ ను హెచ్ఎండీ నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఫోన్ విక్రయాలు సాగనుండగా, నోకియా 3, నోకియా 5లు ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా విడుదలయ్యాయి. సోమవారంతోనే ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లు ముగియగా, లాంచింగ్ ఆఫర్లనూ అమేజాన్ ప్రకటించింది.
ఫోన్ ధర రూ. 14,999 కాగా, ప్రైమ్ మెంబర్లకు రూ. 1000 పే బ్యాలెన్స్ ఇస్తామని, ఫోన్ తో పాటు కిండ్లే బుక్స్ కొనుగోలు చేసేవారికి 80 శాతం డిస్కౌంట్ ఇస్తామని, మేక్ మై ట్రిప్ బుకింగ్స్ పై రూ. 2,500 ఆఫర్ తో పాటు, ఐదు నెలల పాటు ఉచితంగా 45 జీబీ డేటాను వాడుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ ఫోన్ లో 5.5 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ సిమ్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం, 16/8 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.