: నా దగ్గర స్క్రిప్ట్ లా?... జర్నలిస్ట్ అనుపమకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన రాంగోపాల్ వర్మ!


బాలీవుడ్ జర్నలిస్ట్, నిర్మాత విధూ వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా, తాను నడిపే 'ఫిల్మ్ కంపానియన్' వెబ్ సైట్ కంటెంట్ కోసం దర్శకుడు రాంగోపాల్ వర్మను సంప్రదించగా, దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం వచ్చిందట. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలు సత్య, కంపెనీ తదితరాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను ఇస్తే, వెబ్ సైట్ లో పెట్టుకుంటానని అనుపమ అడుగగా, తాను ఎటువంటి స్క్రిప్ట్ లు లేకుండానే ఆ చిత్రాలను తీశానని వర్మ చెప్పాడట.

దీన్ని అనుపమ నమ్మలేకపోగా, తన తల్లిపైన, తాను ఎంతో ఇష్టపడే హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ పైన ఒట్టేసి చెబుతున్నానని, స్క్రిప్ట్ తయారు చేసుకోవడం మొదలు పెట్టిన తరువాతే తనకు పరాజయాలు మొదలయ్యాయని అన్నాడట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసిన అనుపమ, ఇది వర్మ మార్క్ క్లాసిక్ ఆన్సర్ అంటూ కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News