: ట్రిపుల్ తలాక్ తీర్పుకు మద్దతుగా కైఫ్ ట్వీట్.... మరోసారి విమర్శల దాడి చేసిన ముస్లిం నెటిజన్లు
భారత సంప్రదాయాలకు, కట్టుబాట్లకు మద్దతుగా ట్వీట్లు చేసి క్రికెటర్ మహ్మద్ కైఫ్ ముస్లిం నెటిజన్ల చేతిలో విమర్శల దాడికి గురవుతుండటం సాధారణ అంశమే. తాజాగా, అదే తరహాలో సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ తలాక్ తీర్పును పొగడుతూ కైఫ్ ట్వీట్ చేశాడు. దీంతో ముస్లిం నెటిజన్లు మరోసారి ఆయనపై విమర్శల వర్షం గుప్పించారు. `ట్రిపుల్ తలాక్ ను రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. దీని వల్ల ముస్లిం మహిళలకు రక్షణతో పాటు ఎంతో అవసరమైన లింగ సమన్యాయాన్ని సమకూరుస్తుంది` అని కైఫ్ ట్వీట్ చేశారు.
దీనికి స్పందనగా `ఇస్లాంలో మహిళలకు ఉండే రక్షణ సంగతి నీకు తెలియదా?`, `ఖురాన్ చదివిన తర్వాత లింగ సమన్యాయం గురించి మాట్లాడండి!`, `మీ మీద త్వరలో ఫత్వా జారీ అవుతుంది చూడండి!`, `ఇలాంటి పోస్టులు చేయకు కైఫ్!` అంటూ వివిధ రకాలుగా ముస్లిం నెటిజన్లు స్పందించారు.