: ఓటర్లకు వైసీపీ నేతల విజ్ఞప్తి!


నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లకు వైసీపీ నేతలు పలు సూచనలు చేశారు. ఉప ఎన్నికలో ఎలాంటి అక్రమాలు జరిగినా, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. 7981230095, 7981429455 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని... తాము వెంటనే ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మరోవైపు, నంద్యాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. బూత్ ల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తొలి రెండు గంటల్లోనే దాదాపు 22 శాతం ఓటింగ్ నమోదయింది. 

  • Loading...

More Telugu News