: నంద్యాలలో పోలింగ్ ఆఫీసర్ కు గుండెపోటు
నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా పూలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికారిగా నియమించబడ్డ శ్రీనివాసరెడ్డికి ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. ఎన్నికల విధుల్లో భాగంగా పూలూరుకు వచ్చిన శ్రీనివాసరెడ్డి, పోలింగ్ ప్రారంభమైన గంట సేపటి తరువాత హఠాత్తుగా కుప్పకూలి పోయారు. వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బంది ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో మరో పోలింగ్ ఆఫీసర్ ను నియమించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల నిమిత్తం 1600 మంది సిబ్బంది, 2,500 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు.