: సిరియాలో డ్రోన్ దాడి ... మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది షఫీ అర్మర్ మృతి!
సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది షఫీ అర్మర్ మృతి చెందాడు. కర్ణాటకలోని బత్కల్ కు చెందిన షఫీ అర్మర్, ఇండియన్ ముజాహిదీన్ రియాజ్ భక్తల్ ప్రేరణతో ఉగ్రవాదం వైపు వెళ్లాడు. భారత్ లో 300 మంది యువతను సోషల్ మీడియా ద్వారా అతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశాడు. హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రకు పథకం వేసింది షఫీ అర్మరే. అయితే, పోలీసులు, ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ లో కుట్ర భగ్నం అయింది. రెండేళ్ల క్రితం అతని అనుచరులు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, షఫీ అర్మర్ మృతితో భారత్ తో ఐసిస్ కు ఉన్న సంబంధాలు దెబ్బతిన్నట్టేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.