: ప‌ర్స‌న‌ల్ లా బోర్డు సాయంత్రంలోపు సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించే అవ‌కాశం ఉంది: అసదుద్దీన్ ఒవైసీ


ట్రిపుల్ త‌లాక్ చెల్ల‌దంటూ, ఆరు నెల‌ల‌లోపు కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై చ‌ట్టం తీసుకురావాల‌ని ఆదేశిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ మ‌రోసారి స్పందించారు. తాను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చ‌దివిన త‌రువాత మ‌రోసారి స్పందిస్తాన‌ని అన్నారు. ప్రాథమిక హక్కుల ప్రకారం పర్సనల్ లా పై సవాలు చేయడం కుదరదని ఒవైసీ పేర్కొన్నారు. ప‌ర్స‌న‌ల్ లా బోర్డు సాయంత్రంలోపు సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించే అవ‌కాశం ఉందని తెలిపారు. స‌మాజంలో సంస్క‌ర‌ణ‌ల ద్వారానే మార్పు రావాలని, చ‌ట్టాలు చేయ‌డం వ‌ల్ల లాభం ఉండ‌దని అభిప్రాయ‌ప‌డ్డారు. ట్రిపుల్ త‌లాక్ అనేది ఓ సామాజిక అంశమ‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News