: ఊబెర్ ఇండియా చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా హైదరాబాదీ మహిళ!
అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబెర్, తమ భారత్, దక్షిణాసియా శాఖలకు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా హైద్రాబాద్‌కు చెందిన విష్పలా రెడ్డిని నియమించింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్పలా రెడ్డికి ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం ఉంది. ఊబెర్ తనకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల విష్పలా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా, హెచ్ఆర్ విభాగాల్లో విష్పల బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హువిట్ అసోసియేట్స్‌లోనూ, కాగ్నిజెంట్‌లోనూ ఆమె పనిచేశారు. ఇటీవల ఊబెర్ సంస్థలో కార్యాలయ వేధింపులు బాగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.