: ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర యూనిట్, నటీనటులు అద్భుతం.. అభినందనలు: ప్రముఖ దర్శకుడు రాజమౌళి
ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ తొలి మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘సైరా నరసింహారెడ్డి చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసే కార్యక్రమంలో నేను కూడా ఒకడిని అయినందుకు గర్విస్తున్నాను. ఈ చిత్ర యూనిట్, నటీనటులు అద్భుతంగా ఉన్నారు. చిత్రయూనిట్ కు అభినందనలు తెలుపుతున్నాను’ అని తన ట్వీట్ లో రాజమౌళి పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు.