: సూర్యగ్రహణాన్ని ఇలా కూడా చూస్తారా?... ఆరుగురు స్కై డైవర్ల ఫీట్... వీడియో చూడండి!
సూర్యగ్రహణాన్ని అందరిలాగ భూమ్మీద నిల్చుని చూస్తే థ్రిల్ ఏముంటుంది అనుకున్నారేమో? ఈ ఆరుగురు స్కై డైవర్లు. అందుకే గ్రహణం కొనసాగుతున్నంతసేపు ఆకాశంలో ఎగురుతూ, గ్రహణంలోని ప్రతి క్షణాన్ని అనుభవించారు. ఓరెగాన్లోని మద్రాస్ ప్రాంతంలో 14వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ వీళ్లు గ్రహణాన్ని చూశారు. వీరి స్కై డైవింగ్ ను లోకల్ టీవీ ఛానల్ ఒకటి లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. దీంతో కింద నిల్చుని గ్రహణాన్ని చూస్తున్న వారంతా మాకు ఈ ఐడియా రాలేదేంటబ్బా! అనుకుని ముక్కున వేలేసుకున్నారు.