: ఈ ఏడాది ఇద్దరు తెలుగు క్రీడాకారులకు అర్జున అవార్డులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన


క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది అందించే అవార్డుల ప్ర‌క‌ట‌న‌ను ఈ రోజు చేశారు. 2017 సంవత్సరానికి గానూ పారా అథ్లెట్ దేవేంద్రకు, హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్ కు రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డులు అందించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు ద‌క్కాయి. 17 మందికి అర్జున అవార్డులు ద‌క్క‌గా, అందులో తెలుగు క్రీడాకారులు వి.జ్యోతి సురేఖ (విలు విద్య‌), సాకేత్ మైనేని (టెన్నిస్‌) ఉన్నారు. ముగ్గురికి ధ్యాన్ చంద్ అవార్డులు అందిస్తున్న‌ట్లు కేంద్ర స‌ర్కారు తెలిపింది.  

  • Loading...

More Telugu News