: ఏపీలో వైద్య సేవలు బాగున్నాయంటూ కేంద్ర మంత్రి ప్రశంసలు


ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం బాగా పని చేస్తోందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. అమరావతి పరిధిలోని తాడికొండలో రూ.4 కోట్లతో నిర్మించిన రూరల్ హెల్త్ సెంటర్ ను, విద్యార్థుల అదనపు వసతి గృహాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ, హెల్త్ సెంటర్ ను, విద్యార్థుల వసతి గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాదిలో ఎయిమ్స్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫాతిమా మెడికల్ కళాశాల వివాదంపై నడ్డాకు మరోమారు వివరించామని, కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. గేట్ ప్రవేశపరీక్షలో ఏపీ విద్యార్థులకు సంబంధించి ఆర్టికల్ 371-డిలో ఉన్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి కూడా మంత్రికి వివరించారని చెప్పారు.

  • Loading...

More Telugu News