: శిల్పా మోహన్ రెడ్డి కోడలు నాగినిరెడ్డికి నోటీసులు!
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి కోడలు నాగినిరెడ్డికి నోటీసులు అందాయి. శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న శిల్పా సహకారబ్యాంక్ ఛైర్ పర్సన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. శిల్పా సహకార బ్యాంక్ నుంచి మహిళలకు డబ్బును పంచుతున్నారని, శిల్పా సూపర్ మార్కెట్ నుంచి ఉచితంగా సరుకులను పంపిణీ చేస్తున్నారంటూ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. వెంటనే సహకార బ్యాంక్, సూపర్ మార్కెట్ లను మూసివేయాలని నోటీసులో ఆదేశించారు.
ఈ నోటీసులపై నాగినిరెడ్డి స్పందించారు. గత ఆరు రోజులుగా పోలీసులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే బ్యాంకు, సూపర్ మార్కెట్ లు నడుస్తున్నాయని ఆమె తెలిపారు. వీటిని మూసివేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.