: నేనేం చెబుతున్నానంటే... ఒద్దిక, వినయం, మంచి, మర్యాద ఏమీ వద్దు... ఓన్లీ కాన్ఫిడెన్సే!: విజయ్ దేవరకొండ


'ఒద్దిక, వినయం, మంచి, మర్యాద అని పెద్దలు చెబుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకోవద్దు. నేనేం చెబుతానంటే తలపైకెత్తండి. యువర్ చిన్ అప్ అండ్ సే ఐ యామ్ కాన్ఫిడెంట్' అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నాడు. అర్జున్ రెడ్డి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'ఇంజనీర్ అయితే ఇల్లు కడతానని, వేరొకరైతే ఇంకొకటి చేస్తానని ధైర్యంగా చెప్పండి. హ్యుమానిటీ, తొక్క, తోలు అన్న మాటలు పట్టించుకోకండి' అన్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నాడు. చాలా గొప్ప కథ అని చెప్పాడు. సినిమా అందరికీ నచ్చుతుందని అన్నాడు. నిజమైన ప్రేమకు ఈ సినిమా అర్థం చెబుతుందని విజయ్ దేవరకొండ తెలిపాడు. 

  • Loading...

More Telugu News