: భూమికి, సూర్యునికి మ‌ధ్య‌ అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం అడ్డొస్తే?... వీడియో చూడండి!


భూమికి, సూర్యునికి మ‌ధ్య చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్ర‌హ‌ణం అంటారు. మ‌రి అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం అడ్డొస్తే ఏమ‌ని పిల‌వాలి? ఫొటోబాంబ‌ర్ అనాలి. అవును... నిన్న ఏర్ప‌డిన సూర్య‌గ్ర‌హ‌ణంతో అమెరిక‌న్లు ఓ చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి నిద‌ర్శ‌నంగా నిలిచారు. త‌మ కెమెరాల్లో, ఫోన్ల‌లో వీలైన‌న్ని ఫొటోలు తీశారు. కానీ అమెరికాలోని వ్యోమింగ్ ప్రాంతంలో తీసిన సూర్య‌గ్ర‌హ‌ణం వీడియోల‌ను, ఫొటోల‌ను మాత్రం అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం చెడ‌గొట్టి, ఫొటోబాంబ‌ర్‌గా నిలిచింది.

సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం వీడియోను తీద్దామ‌నుకున్న వారంద‌రికీ వీడియోలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం సూర్యుని ముందుగా వెళ్ల‌డం క‌నిపించింది. నాసా ఫొటోగ్రాఫ‌ర్ జోయెల్ కోయేస్కీ తీసిన ఫొటోలో ఈ విష‌యం మ‌రీ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిస్తూ గ్ర‌హ‌ణం స‌మ‌యంలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం సూర్యుని ముందు నుంచి ప్ర‌యాణిస్తున్న ఫొటోల‌ను, వీడియోల‌ను విడుద‌ల చేసింది.

  • Loading...

More Telugu News