: 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలిసిన దినకరన్... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్!
తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును టీటీవీ దినకరన్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల విలీనం, కొత్త మంత్రుల నియామకం చెల్లదని, పళనిస్వామి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన తన మద్దతుదారులైన 19 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నర్ ను కలిశారు. తక్షణం పళనిస్వామి సర్కారును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, దీనిపై గవర్నర్ నిర్ణయం తెలియాల్సి ఉంది.