: హోటల్ పై ఆగ్రహంతో తన విగ్రహం ముందే పడుకొని నిరసన తెలిపిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్... ఫొటో చూడండి!


హాలీవుడ్ స్టార్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, నడిరోడ్డుపై పడుకుని, నిద్రపోయి సంచలనం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓహియోలోని కొలంబస్ ప్రాంతంలో గతంలో ఓ హోటల్ ప్రారంభం కాగా, దానికి ఆర్నాల్డ్ వచ్చాడు. ఈ సందర్భంగా హోటల్ బయట ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించిన హోటల్ యాజమాన్యం, ఆర్నాల్డ్ ఎప్పుడు వచ్చినా ఉచితంగా గది ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక ఓ పని మీద ఆ ప్రాంతానికి వెళ్లిన ఆర్నాల్డ్, హోటల్ లో గది కోసం వెళ్లగా, రూమ్స్ ఖాళీ లేవని చెప్పిన నిర్వాహకులు మొండి చెయ్యి చూపారు. దీంతో కంగుతిన్న ఆర్నాల్డ్, హోటల్ ముందున్న తన విగ్రహం ఎదుట పడుకొని నిరసన తెలిపాడు. ఓ సూపర్ స్టార్ ఇలా నేలపై సేద తీరడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News