: సర్ప దోష నివారణ పూజలు చేసిన అల్లరి నరేష్ దంపతులు


టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ దంపతులు శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలను ప్రత్యేకంగా చేయించుకున్నారు. దోష నివారణ పూజల అనంతరం స్వామివారిని నరేష్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పూజారులు నరేష్ కు ఆశీర్వచనం పలికారు. ఆపై స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందించారు. నరేష్ వచ్చాడని తెలుసుకున్న భక్తులు, అభిమానులు పెద్దఎత్తున వచ్చి, ఆయన్ను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. కాగా, గాయని స్మిత కూడా కాళహస్తి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News