: ప్రస్తుతానికి మేం సహజీవనంలో ఆనందంగా ఉన్నాం: ఇలియానా


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, బాలీవుడ్ కి వెళ్లిపోయిన గోవా బ్యూటీ ఇలియానా... ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల 'మిడ్ డే' పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తమ ప్రేమాయణంపై పలు విషయాలను వెల్లడించింది. ఆండ్రూ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని... ప్రస్తుతానికి తాము సహజీవనంలో ఉన్నామని, జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నామని చెప్పింది. పెళ్లికి, సహజీవనానికి మధ్య ఉన్న తేడా చాలా చిన్నదే అని తెలిపింది.

సినీ పరిశ్రమలో 11 ఏళ్లుగా కొనసాగుతున్న తాను... అకారణంగా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నానని ఇల్లీ చెప్పింది. తాము చేసే వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయని... ఇలాంటి ఇబ్బందుల్లోకి ఆండ్రూని లాగడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని... అతనొక సాధారణ వ్యక్తి అని, మామూలుగా ఉండటానికే అతను ఇష్టపడతాడని వెల్లడించింది. అతని ప్రైవసీకి భంగం కలిగించడం తనకు నచ్చదని చెప్పింది.

  • Loading...

More Telugu News