: ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్‌కు అధికారికంగా నామకరణం చేసిన గూగుల్.. 'ఓరెయో'గా పిలుపు!
మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ విడుదల చేస్తున్న గూగుల్ తన తాజా అప్డేటెడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 8.0 పేరును ఆండ్రాయిడ్ 'ఓరెయో'గా అధికారికంగా ప్రకటించింది. తాజా వెర్షన్లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ఐకాన్స్పై నోటిఫికేషన్ డాట్స్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, పాస్వర్డ్ భద్రత కోసం ఆటోఫిల్ టూల్ తదితర ఆప్షన్లను తాజా వెర్షన్లో జోడించింది. గూగుల్ నెక్సస్ నుంచి వస్తున్న పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లతో ఈ ఆండ్రాయిడ్ ఓరెయో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.