: నన్ను సస్పెండ్ చేశారనే వార్త అబద్ధం: సిరిసిల్లా జిల్లా ఎస్పీ విశ్వజిత్


దళితులపై దాడి ఘటనలో తనను సస్పెండ్ చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ విశ్వజిత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేరెళ్ల ఘటనలో తనను సస్పెండ్ చేశారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని, ఆ వార్తలు అబద్ధమని చెప్పారు. లడక్ సరిహద్దులో నిర్వహించనున్న నివాళి కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను అధికారికంగా వెళుతున్నానని చెప్పారు.

 తెలంగాణ రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేశారని, ఈ నేపథ్యంలో  పదిహేను రోజుల పాటు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం వెళుతున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనలో సిరిసిల్ల సీసీఎస్‌ ఎస్ఐ రవీందర్‌ ను డీఐజీ సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ విశ్వజిత్‌ను కూడా సస్పెండ్‌ చేసినట్టు మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

  • Loading...

More Telugu News