: మీరు చేసింది ధర్మ యుద్ధమా?: పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు స్టాలిన్ సూటి ప్రశ్న
తమిళనాడు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. అన్నాడీఎంకే నేతలు ధర్మ యుద్ధం చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పుకున్నారని, అయితే పదవుల కోసం ఈ రోజు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు కలిశారని విమర్శించారు. పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు. ఆ ఇరువర్గాల కలయిక ఓ నాటకమని, పళనిస్వామి, పన్నీర్ సెల్వం మహానటులని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పదవులు పొందడం కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.