: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
ఇన్ఫోసిస్ సంక్షోభ ప్రభావం ఈ రోజు స్టాక్ మార్కెట్లపైనా పడటంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 9,754 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 265 పాయింట్లు నష్టపోయి 31,253 పాయింట్ల వద్ద ముగిసాయి. ఇక, షేర్ల విషయానికి వస్తే.. టీసీఎస్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా, ఇన్ఫోసిస్ అమెరికాలో కూడా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోందనే వార్తలు రావడంతో భారత్ లోని అత్యంత విలువైన పది కంపెనీల జాబితా నుంచి ఇన్ఫోసిస్ బయటకు వచ్చేసింది.