: ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వం.. పాండ్యరాజన్ కి భాషాభివృద్ధి శాఖ!
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఈ రోజు తిరిగి ఒక్కటైన విషయం తెలిసిందే. దీంతో పన్నీర్ సెల్వంతో పాటు పాండ్య రాజన్... పళనిస్వామి మంత్రివర్గంలో చేరుతూ ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. పాండ్యరాజన్‌కు తమిళ భాషాభివృద్ధి శాఖ బాధ్యతలు ఇచ్చారు. అలాగే అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీకి కన్వీనర్ గా పన్నీర్ సెల్వం వ్యవహరించనున్నారు. ఇదే కమిటీ సహ కన్వీనర్ బాధ్యతలను పళనిస్వామి నిర్వర్తించనున్నారు.