: ఇకపై ‘సాక్షి’ మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయమై పునఃసమీక్షిస్తాం: మంత్రి యనమల
సాక్షి మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయమై ఇకపై పునఃసమీక్షించాలని భావిస్తున్నామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రెస్ కౌన్సిల్ గైడ్ లైన్స్, జర్నలిజం విలువలు పాటించని సాక్షి మీడియాకు ఈ రోజు వరకూ యాడ్స్ ఇచ్చామని, ఇకపై ఆలోచిస్తామని అన్నారు. సాక్షి మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఉద్యోగులు, అర్చకుల జీతాలు తగ్గిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అందుకు ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావిస్తూ, ప్రతిపక్షనేతగానే కాదు, అసలు, రాజకీయాలకే ఆయన తగడని విమర్శించారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో హిట్లర్, గోబెల్స్ ను జగన్ మించిపోయాడని విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల జప్తు చేసిన రూ.18 వేల కోట్లు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆయన ప్రశ్నించారు.