: రజనీకాంత్ `కాలా` చిత్రంలో సముద్రకని!
నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సముద్రకని, రజనీకాంత్ తదుపరి చిత్రం `కాలా`లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. `విసరణై` చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తర్వాత సముద్రకనికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ‘కాలా’, ‘పేరన్బు’, ‘మదురై వీరన్’, ‘ఆకాశ మిఠాయ్’లతో పాటు పదికి పైగా చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న రెండో సినిమా ‘కాలా’లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. `కాలా`లో సముద్రకని పాత్ర ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చి, మరింత అభిమానాన్ని సొంతం చేసుకుంటారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.