: రోజా! నంద్యాలలో ఓడితే నేను గుండు గీయించుకుంటా... నువ్వు గుండు గీయించుకుంటావా?: టీడీపీ నేత బోండా ఉమ సవాల్
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే తాను గుండు గీయించుకుంటానని, వైఎస్సార్సీపీ ఓటమిపాలైతే నువ్వు గుండు గీయించుకుంటావా? అంటూ వైసీపీ నేత రోజాకు టీడీపీ నేత బోండా ఉమ సవాల్ విసిరారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. టీడీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీని విజయం దిశగా నడిపిస్తాయని ఆయన అన్నారు. నంద్యాలలో ఓటమిపాలైతే గుండు కొట్టించుకోవడానికి తాను సిద్ధమని, వైఎస్సార్సీపీ ఓటమిపాలైతే గుండు గీయించుకునేందుకు నువ్వు సిద్ధమా? అని రోజాకు ఆయన సవాల్ విసిరారు.