: మళ్లీ ప్రియుడితో సందడి చేసిన దీపికా పదుకునే... వీకెండ్ పార్టీలో బాలీవుడ్ తారలు!
ఈ వీకెండ్ బాలీవుడ్ స్టార్స్ ని కలిపింది. బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత రితేశ్ సిద్వానీ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ముంబైలో జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్రమోషన్ పొందిన ప్రియాంకా చోప్రా మలైకా అరోరా, కిమ్ శర్మ, కరణ్ జోహర్, సోహైల్ ఖాన్, చంకీ పాండే, ఫర్హాన్ అఖ్తర్ తదితరులు చాలా మంది హాజరుకాగా, ఈ వేడుకలో బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ ఒకే కారులో రావడం విశేషం. దీపిక హాలీవుడ్ కు వెళ్లిన తరువాత వీరిద్దరూ పెద్దగా కలిసింది లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వీరి ప్రేమ బ్రేకప్ అయిందని వార్తలు హల్ చల్ చేశాయి. 'పద్మావతి' సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ ఈ వేడుకకు జంటగా వచ్చిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.