: సింగపూర్ సముద్రంలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న నౌకలు.. పదిమంది అమెరికా నావికుల గల్లంతు!
సింగపూర్ సముద్ర జలాల్లో జరిగిన ప్రమాదంలో అమెరికాకు చెందిన పదిమంది నావికులు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ జాన్ ఎస్ మెక్ కెయిన్ ప్రమాదవశాత్తు వాణిజ్య నౌక అల్నిక్ మెక్‌ను ఢీకొంది. తూర్పు సింగపూర్‌లోని స్ట్రెయిట్స్ ఆఫ్ మాలాకా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా నేవీ పేర్కొంది. ఈ ఘటనలో జాన్ ఎస్ మెక్ కెయిన్ నౌక దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రమాదం తర్వాత పదిమంది నావికులు కనిపించకుండా పోగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.