: టీమిండియా క్రికెటర్ల ఘనత.. వన్డేల్లో ధావన్ 11వ సెంచరీ..కోహ్లీ 44వ హాఫ్ సెంచరీ
టీమిండియా క్రికెటర్ ధావన్ వన్డే మ్యాచ్ లలో మరో ఘనత సాధించాడు. శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసిన ధావన్, వన్డేల్లో తన 11వ శతకం పూర్తి చేశాడు. కేవలం 71 బంతుల్లోనే ధావన్ ఈ సెంచరీ కొట్టడం విశేషం.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్ లో 44వ హాఫ్ సెంచరీ చేశాడు. కాగా, ధావన్-కోహ్లీ ల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. 24 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 168/1.