: వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారంటూ హాస్యనటుడు వేణుమాధవ్ ఫిర్యాదు


వైసీపీ వాళ్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేసిన తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ పని వైసీపీ వాళ్లే చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా, నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో కొన్ని రోజులుగా పాల్గొంటున్న వేణుమాధవ్.. వైసీపీ తీరుపై, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేయడం తెలిసిందే. 'రోజా' అంటే 'రో' యహాసే 'జా' (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని, టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని... అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని ఇటీవల వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News