: ‘కాల్చండి, ఉరితీయండి’ అనే నేతను సమర్థిస్తారా?: బలిజల ఆత్మీయ సమావేశంలో సీఎం చంద్రబాబు


‘కాల్చండి, ఉరితీయండి’ అంటూ మాట్లాడే నేతను సమర్థిస్తారా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నంద్యాలలో బలిజల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, కాపులను టీడీపీకి దూరం చేసేందుకు కొందరు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాపులకు గుర్తింపు ఇచ్చేది టీడీపీ మాత్రమేనని అన్నారు.

నంద్యాలకు పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. ఓట్ల కోసం ఎక్కడా లేని ప్రేమను ప్రతిపక్ష నేత జగన్ ఒలకబోస్తున్నారని విమర్శించారు. కాపులు, బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీయేనని, వారికి గుర్తింపు ఇచ్చేది తమ పార్టీయేనని చంద్రబాబు చెప్పారు. 2014లో కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చానని, వారి ఆర్థిక పరిస్థితి చూశాకే పిఠాపురంలో నాడు ప్రకటన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చిత్తశుద్దితో టీడీపీ మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసిందని, ఈ నివేదిక వచ్చాక రిజర్వేషన్లపై తగు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News