: నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ కేసులో వైకాపా ఎమ్మెల్యేలు... అనిల్ కుమార్, కోటంరెడ్డిలకు నోటీసులు


నెల్లూరులో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈనెల 22వ తేదీన ఎస్పీ రామకృష్ణ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలు ఇంట్లో లేకపోవడంతో, అక్కడున్న వారి బంధువులకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ కేసులో అధికార తెలుగుదేశం నేతల పాత్ర ఉంటే, తమను ఇబ్బందులు పెడుతున్నట్టు వైకాపా ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News