: స్పెషల్ ఫోర్స్ దళాలకు ఏసీ జాకెట్లు... అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నాను!: మనోహర్ పారికర్


ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ లోని జవాన్లకు ఎయిర్ కండిషన్డ్ జాకెట్లను అందించేందుకు ట్రయల్స్ మొదలయ్యాయని రక్షణ శాఖ మాజీ మంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. స్పెషల్ ఫోర్స్ దళాలు ఏవైనా ఆపరేషన్స్ లో పాల్గొన్నప్పుడు, వారి శరీరాలు ఎంతో వేడెక్కిపోతుంటాయని, ఆ సమయంలో జవాన్లు చాలా అసంతృప్తిగా, అసౌకర్యంతో ఉంటారని గుర్తు చేసిన ఆయన, అట్లాంటి వేళ, ఏసీ జాకెట్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

విద్యార్థులతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాను రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఏసీ జాకెట్లపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. తేలికపాటి యుద్ధ విమానాలు తేజాస్ విషయంలో ఒకే వైఫల్యం ఉందని, వాటిల్లో కేవలం 3.5 టన్నుల బరువున్న బాంబులను మాత్రమే అమర్చగలమని అన్నారు. ఇతర అంశాల్లో ప్రపంచంలోనే ఉత్తమ యుద్ధ విమానాలుగా చెప్పుకునే వాటికన్నా మెరుగైన సామర్థ్యముందని చెప్పుకొచ్చారు. తేజాస్ విమానాలు ఐదేళ్ల క్రితమే సిద్ధమయ్యాయని, అయితే, ఇంకా వాయుసేనలోకే చేరలేదని అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ విమానాలు దేశానికి మెరుగైన సేవలను అందించగలవని తెలిపారు.

  • Loading...

More Telugu News