: హీరోయిన్ ను వేధించిన కేసులో దర్శకుడు చలపతి, హీరో స్టీఫెన్ లకు రిమాండ్!
సినిమా షూటింగ్ అంటూ వర్ధమాన నటిని కారులో ఎక్కించుకుని తీసుకెళుతూ లైంగికంగా వేధింపులు జరిపిన కేసులో హీరో స్టీఫెన్, దర్శకుడు చలపతిలకు సెప్టెంబర్ 1 వరకూ రిమాండ్ ను విధిస్తున్నట్టు విజయవాడ నాలుగవ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఇందిరా ప్రియదర్శిని ఆదేశాలు జారీ చేశారు. స్టీఫెన్ అలియాస్ సృజన్ లు గత సోమవారం నాడు తనతో కలసి విజయవాడకు బయలుదేరిన వేళ, అసభ్యంగా ప్రవర్తించారని, దారుణంగా కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన పోలీసులు తొలుత చలపతిని, ఆపై స్టీఫెన్ ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.