: ఏడు పరాజయాల తరువాత ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్!


తొలి మ్యాచ్ మినహా, ఏడు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ప్రో కబడ్డీ లీగ్, హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. గత రాత్రి లక్నోలో జరిగిన పోరులో యూ ముంబా జట్టుతో తలపడిన టైటాన్స్ 37-32 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రాహుల్ చౌదరి రెండు సూపర్ రైడ్ లు సహా 13 పాయింట్లు తేవడం, అతనికి సోమ్ బీర్ నుంచి (8) మంచి సహకారం లభించడంతో ఓ దశలో 27-27తో స్కోరు సమానంగా ఉన్నా తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. చివరి నిమిషాల్లో ముంబై రైడ్ పాయింట్లను తేవడంలో విఫలం కాగా, రాహుల్ విజృంభించడం కలిసొచ్చింది. ఇంకో మ్యాచ్ లో హరియాణా స్టీలర్స్ జట్టు యూపీ యోధపై 36-29 తేడాతో గెలిచింది.

  • Loading...

More Telugu News