: రోడ్డు ప్రమాదంలో హిందీ బుల్లితెర నటుల మృతి!
హిందీలో ప్రసారం అవుతున్న ‘సంకటమోచన్ మహాబలి హనుమాన్’ సీరియల్‌లో నటిస్తున్న గగన్ కాంగ్, అర్జిత్ లావానియాలు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిరువురూ ‘మహాకాళి’ టీవీ షో షూటింగ్‌లో పాల్గొని అహ్మదాబాద్ నుంచి కారులో ముంబయికి బయలుదేరారు. అయితే, ఆ కారు అదుపుతప్పి ఒక్కసారిగా ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ నిన్న చాలా సేపు షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఆ కారును నటుడు గగన్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.