: అమ్మాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించి, చంపేసిన యువ‌కుడు.. అనంతరం రైలుకింద పడి ఆత్మహత్య!


త‌న‌ను ప్రేమించ‌డంలేద‌నే కోపంతో ఓ 17 ఏళ్ల అమ్మాయిపై ఓ యువ‌కుడు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న విశాఖప‌ట్నంలోని భీమిలి మండలం టి.నగరపాలెంలో చోటు చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు అంటుకున్న మంట‌లు ఆర్ప‌డానికి ఆమె సోద‌రుడు ఉపేంద్ర‌ చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. ఈ ప్ర‌య‌త్నంలో ఉపేంద్ర‌కు కూడా గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మ‌రోవైపు ఆ అమ్మాయిపై కిరోసిన్‌ పోసి నిప్పటించిన యువ‌కుడు హరి సంతోష్ అనంత‌రం విజయనగరం జిల్లా గోకపేట వద్ద‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  

  • Loading...

More Telugu News