: ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని ఇలా వెరిఫై చేసుకోండి!
ప్రభుత్వం అందించే పథకాల కోసమే కాకుండా బ్యాంకులో కొత్తగా ఖాతా తెరవాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలన్నా అన్నింటికీ ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింకు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆధార్ కార్డులో ఏవయినా తప్పులు ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అందులో ఏవయినా తప్పులు ఉంటే వాటిని తనిఖీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మన ఫోన్ నెంబర్ చాలా ముఖ్యమైనది. ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే.. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మనం ఇచ్చిన మొబైల్ నెంబరు ఇప్పుడు మనదగ్గర ఉండాల్సిందే. ఆధార్ లోని మీ మొబైల్ నెంబరు, మీ ఈ-మెయిల్ ఐడీని ఎలా వెరిఫై చేసుకోవచ్చో చూద్దాం..
మొదట uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
* కుడివైపున పర్పుల్ (ఊదా) కలర్‌లో ఆధార్ సర్వీసెస్ అని కనపడుతుంది
* అందులో రెండో ఆఫ్షన్‌గా వెరిఫై ఈ-మెయిల్/ మొబైల్ నెంబర్ అనే ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి
* ఇప్పుడు అడిషనల్ డైలాగ్ పేజ్ వస్తుంది.. దానిపై ఓకే ఆఫ్షన్‌ని క్లిక్ చేయండి
* ఇప్పుడు ఓ సెపరేట్ పేజ్ వస్తుంది.. అందులో మీ ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు, ఈ-మొయిల్ ఐడీని టైప్ చేయండి. దానికిందే సెక్యూరిటీ కోడ్ ఉంటుంది... దాన్ని కూడా టైప్ చేసి కింద ఉండే గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది
* ఆ ఓటీపీని టైప్ చేస్తే మీకు ‘కంగ్రాట్యులేషన్స్, మీ ఈ మొయిల్ మ్యాచ్ అయింది’ అనే సందేశం కనపడుతుంది.
* మీ మొబైల్ నెంబరును వెరిఫై చేసుకోవడానికి కూడా ఇదే విధంగా అన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. అయితే, మొబైల్ నెంబరు వెరిఫై చేసుకునే సమయంలో ఈ-మెయిల్ ఐడీ టైప్ చేయకూడదు. మీ మొబైల్ నెంబరు వివరాలు సరిగా ఉంటే మీకు ‘కంగ్రాట్యులేషన్స్, మీ ఈ మొబైల్ నెంబర్ మ్యాచ్ అయింది’ అనే సందేశం వస్తుంది.