: రెండు నెలల పితృత్వ సెలవులు తీసుకోనున్న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్
తనకు రెండో కూతురు జన్మించనుండడంతో రెండు నెలలపాటు పితృత్వ సెలవులు తీసుకోనున్నట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు. గతంలో తన మొదటి కూతురు మాక్స్ జన్మించినపుడు కూడా తాను పితృత్వ సెలవులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
`తన జీవితంలోని మొదటి రోజుల్లో ఆమెతో గడపడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. త్వరలో మాకు రెండో పాప పుట్టనుంది. అందుకే రెండు నెలలు పితృత్వ సెలవులు తీసుకోవాలనుకుంటున్నా` అని మార్క్ పోస్ట్ చేశారు. `పిల్లలు పుట్టిన కొత్తలో తల్లిదండ్రులు వారితో గడపడం ఆ కుటుంబానికి మంచిదని పరిశోధనల్లో తేలింది. అందుకే మా ఫేస్‌బుక్ ఉద్యోగులకు నాలుగు నెలల పాటు మాతృత్వ, పితృత్వ సెలవులు కల్పిస్తున్నాం. నేను తిరిగి వచ్చేసరికి ఫేస్‌బుక్ నిలకడగానే ఉంటుందని ఆశిస్తున్నాను` అని మార్క్ పేర్కొన్నారు.